రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకునేందుకు వీలుగా అనుమతిచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. నగదును రికవరీ చేసుకున్న పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆమె నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు. పనికోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు జిల్లా మత్స్య శాఖ అధికారి. ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ-లో కొత్త సభ్యుల పేర్ల నమోదుకు అవకాశం కల్పించడం కోసం ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు చరిత రెడ్డి. ఈ క్రమంలో గురువారం బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా చరిత రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





