– మంత్రి ఉత్తమ్, సీఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశపు హాలులో పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృ ష్ణారావులతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలను సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు, పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందవద్దని వినియోగదారులకు సూచించారు. సాధారణంగా కొనుగోలు చేసే దాని కంటే ఎక్కువగా కొని నిల్వ చేయవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. బంకుల వద్దకు వచ్చే చివరి వాహనదాదారునికి కూడా పెట్రోల్, గ్యాస్ దొరుకుతుందనే భరోసా కల్పించాలని అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు రెÃజూవారీగా పత్రికలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమిషనర్లు సజ్జన్నార్, సుధీర్‌బాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





