– అభిషేక్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు
రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి
ఫామ్ హౌజ్ సీజ్.. అసైన్డ్ భూమిలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్లో లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. మొయినాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ నిర్వహించిన సమయంలో ఫామ్హహౌస్లో జరిగిన పార్టీకి హాజరైన వారి విలాసవంతమైన వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫామ్ హౌస్ ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్న్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, భూభారతి రికార్డుల ప్రకారం అది జంగయ్య అనే వ్యక్తి పేరు ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన రెవెన్యూ శాఖ, ఫామ్ హౌస్ ను సీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు నివేదిక అందించింది. పోలీసుల విచారణ లో భాగంగా ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ వారి కస్టడీలోనే ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


