సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 27: మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ’ఎక్స్‘లో పోస్టు చేశారు. నవభారత చరితలో విజ్ఞాన విధాత కలాం.. మీకు సలాం.. అంటూ నివాళురల్పించారు. కలాం ఆదర్శాలను గుర్తుచేసుకుంటూ ఆయన విలువలు, ఆలోచనలను అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేరణతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం





