హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26ః రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యుల నుండి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన అధికార నివాసానికి నరసింహాచార్యులుతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతికి స్పీకర్ ప్రసాద్ కుమార్ పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, శాసన మండలి కార్యదర్శిగా నరసింహాచార్యులు కొనసాగుతారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




