ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా ఏవోయూ వీసీ చక్రపాణి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యుడిగా బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌-చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఓపెన్‌ యూనివర్సిటీస్‌ సెక్రటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ రహమత్‌ బుదిమాన్‌ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా ఖండంలోని అన్ని ఓపెన్‌ యూనివర్సిటీలు ఇందులో సభ్యులుగా ఉంటాయి. బీజింగ్‌లో ఇటీవల జరిగిన 2025 సంవత్సరపు సాధారణ సర్వసభ్య సమావేశంలో ఏఏఓయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ చక్రపాణి మాట్లాడుతూ ఏఏఓయూకు కార్యనిర్వాహక సభ్యుడిగా ఎంపిక కావడం తన భాద్యతను మరింత పెంచిందన్నారు. తెలంగాణలో సార్వత్రిక విద్య గ్రామీణ ప్రాంతంలో మరింత విస్తరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అందుబాటులో ఉన్నత విద్య ఉండేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణిని రిజిస్ట్రార్‌ డా. ఎల్వీకే రెడ్డి, అకాడమిక్‌ డైరెక్టర్లు ప్రొఫెసర్‌ పుష్పాచక్రపాణి, ప్రొఫెసర్‌ ంవీంద్రనాథ్‌ సోలమన్‌, రాణి రజిత మాధురి, తెలుగు ప్రొఫెసర్‌ ఎన్‌.రజని, భోజు శ్రీనివాస్‌, రమాదేవి, దయాకర్‌, స్టూడెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వెంకటేశ్వర్లు, డాక్టర్‌ బర్ల మహేందర్‌ తదితరులు అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *