యువకుడిపై గంజాయి బ్యాచ్‌ ‌దాడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ ఆగడాలు రోజురోజుకూ మితిరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్‌ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ ‌యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్‌ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఫహాద్‌ కుప్ప‌కూలాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఫహాద్‌పై ఈ గ్యాంగ్‌ ‌దాడి చేసినట్లు తెలుస్తోంది. షానవాజ్, ‌షాబాజ్‌తోపాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు పోలీస్‌ ‌స్టేషన్‌లో యువకుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *