హైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే విషాద సంఘ‌ట‌న‌

– రూ.25ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి.
-అంబులెన్స్ లో ఆక్సిజ‌న్‌, మాస్క్ లు లేవు
– పైరింజ‌న్‌లో నీళ్లు లేవు
– అధికార్ల‌కు శిక్ష‌ణ అవ‌స‌రం
– గుల్జారీ హౌజ్ అగ్నిప్ర‌మాదంపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌

గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమ‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.తార‌క‌రామారావు అన్నారు. సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదన్నారు.  ఫైర్ బ్రిగేడ్ కు సరైన మాస్కులు లేకపోవడంలో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారన్నారు.  125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గుల్జార్ హౌస్ గురించి తెలియని వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో ఎవరూ లేరు. ఈ విషాద సంఘ‌ట‌న‌ మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింద‌న్నారు. బాధిత కుటుంబసభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కాని వారు కొన్ని విషయాలు చెప్పారు.

ఫైర్ బ్రిగేడు నీళ్లు లేకుండా వచ్చింది. ఫైర్ బ్రిగేడ్ వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారు. అంబులెన్స్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణం.ఈ కనీస సదుపాయలు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతికేవని బాధిత కుటుంబ సభ్యులు తెలిపార‌న్నారు. అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి త‌మ‌ను  కాపాడారని చెప్పారు.త‌మ‌కు  జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు.భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరారు.  ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాల‌ని సూచించారు.

పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు రావడానికి కూడా వీలుకాలేదు. అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలి. తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఇవేవి జరగలేదు. ఇది మంచిది కాదన్నారు.అంబులెన్స్ లు వచ్చినయి కాని అందులో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్లముందే చనిపోయారని చెబుతున్నార‌న్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడమ‌ని ప్ర‌భుత్వానికి స‌ల‌హా ఇచ్చారు.సిఎం రేవంత్ రెడ్డి దగ్గరనే హోం,మున్సిపల్ శాఖలు ఉన్నాయి. సంఘటనా స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేదన్నారు.ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదు. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగింద‌ని గుర్తు చేశారు. రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.బీఆర్ఎస్ తరపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *