– ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ హతం
– ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
టెహ్రాన్, మార్చి18: సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు దెబ్బద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతిచెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ బుధవారం ప్రకటించారు. ఇరాన్ సీనియర్ అధికారులు ఎవరినైనా సరే ఎలాంటి అదనపు అనుమతులు అవసరం లేకుండా మట్టుబెట్టాలని మిలిటరీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు స్వేచ్ఛనిచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే ఇస్మయిల్ ఖతీబ్ మృతి వార్తలను ఇరాన్ ఇంకా ధ్రువీకరించలేదు. కాగా, ఇస్మయిల్ ఖతీబ్ మృతికి ఒక రోజు ముందే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఆయనతోపాటు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్‌జీసీ) పారామిలిటరీ దళం ’బసిజ్ ఫోర్స్’ కమాండర్ గోలం రెజా సోలేమానీ, పెద్ద సంఖ్యలో మిలిటరీ ఉన్నతాధికారులు తమ దాడుల్లో మృతిచెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. జ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆదేశంలోని 100 టార్గెట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ తెలిపింది. ఉద్రిక్తతలను తగ్గించే ప్రతిపాదనను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తోసిపుచ్చారు. శాంతికి ఇది సమయం కాదని, ఓటమిని అంగీకరించి నష్టపరిహారం ఇచ్చేంతవరకూ అమెరికా, ఇజ్రాయెల్‌తో శాంతి కుదరదని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



