సెకండక్టర్‌ ‌పరిశ్రమలో కీలక అడుగు

సింగపూర్‌ ‌పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చలు
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18:సెకండక్టర్‌ ‌పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూల మైన విధానాలు సింగపూర్‌ ‌పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి.ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రానికి కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు, ఆర్థికాభివృద్ధికి  సహాయపడే అవకాశం ఉంది.సెకండక్టర్‌ ‌పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనున్నాయి. హైదరాబాద్‌ ‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ‌హబ్‌గా మార్చడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌ ‌బాబు సింగపూర్‌లో సెకండక్టర్‌ ‌పరిశ్రమ అసోసియేషన్‌ (ఎస్‌ఎస్‌ఐఏ)‌తో ప్రత్యేక రౌండ్‌ ‌టేబుల్‌ ‌చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంస్థలు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎస్‌ఐఏ ‌ఛైర్మన్‌  ‌బ్రియాన్‌ ‌టాన్‌, ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌టాన్‌ ‌యూ కాంగ్‌, ‌సెక్రటరీ సి.ఎస్‌.‌చుహ  తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చల్లో రాష్ట్రంలో సెకండక్టర్‌ ‌పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్‌ ‌బాబు వివరించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సహకారం ప్రోత్సాహకాలను వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా సెకండక్టర్‌ ‌పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానానికి ఎఎస్‌ఐఏ ‌ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.సెకండక్టర్ల పరిశ్రమల  పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్‌ ‌నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పరిశీలన జరుపుతారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *