రూ.200 కోట్లతో ‘బన్యన్‌ ‌నేషన్‌’ ‌కంపెనీ భారీ విస్తరణ

మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు మంత్రి శ్రీధర్‌ ‌బాబు

పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. సచివాలయంలో గురువారం సంస్థ ప్రతినిధులతో సమవేశం అనంతరం ఆయన వివరాలు తెలిపారు. ప్రస్తుతం పటాన్‌ ‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో ‘బన్యన్‌ ‌నేషన్‌’ ‌రీ సైక్లింగ్‌ ‌పరిశ్రమను నిర్వహిస్తోంది. దీనిని 45 వేల టన్నులకు విస్తరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని ఆయన చెప్పారు.

విస్తరణ పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. రీసైకిల్‌ ‌చేసిన ప్లాస్టిక్‌ ‌ను ఈ సంస్థ యూనిలివర్‌, ‌టాటా మోటార్స్ ‌లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తోందని శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న ‘బన్యన్‌ ‌నేషన్‌’ ‌లాభాల్లో నడుస్తోందని చెప్పారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు కోసం వారు మరికొంత భూమిని అడుగుతున్నారని, దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ సిఇఓ వి. మధుసూదన్‌, ‌బన్యన్‌ ‌నేషన్‌ ‌సిఇఓ మణి వాజిపేయ్‌, ‌సిఓఓ రాజ్‌ ‌కిరణ్‌ ‌మదనగోపాల్‌ ‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *