హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 7 : తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియామకమైన కేయూ విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ ను తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్, తెలంగాణ ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా సత్కరించారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో అనేక పరిపాలక పదవులను సమర్థవంతంగా నిర్వహించి పదవులకే వన్నెతెచ్చిన దయాకర్ ను ప్రభుత్వం గుర్తించి అభినంందించగ్గ విషయమని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ ఎస్సి స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కొంగర జగన్మోహన్ అభిప్రాయపడ్డారు. సన్మానించిన వారిలో టీజీపీఏ అధికార ప్రతినిధి తనుగుల శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్ మాసారపు సాంబశివరావు, చందర్ రావు తదితరులు ఉన్నారు.
విశ్రాంత ఆచార్య గాదె దయాకర్ కు సన్మానం





