కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 2: రెవెన్యూ శాఖలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు ఓ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేవేందర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో చింతల్ కాలనీకి చెందిన రవికుమార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పలుమార్లు సంబంధిత అధికారి జి.పి.ఓ గణేష్ ను కలవగా రూ.30 వేలు లంచం లంచం డిమాండ్ చేశాడు. అంత ఇవ్వటం కుదరదని కొంచం తక్కువ ఇస్తానని అనటంతో రూ.20వేలకు ఒప్పందం కుర్చుకున్నారు. ఐదు రోజుల క్రితం రూ.5 వేలు గణేష్ కు అప్పగించాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను బాధితుడు రవికుమార్ ఆశ్రయించాడు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రవికుమార్ వద్ద నుండి జిపిఓ గణేష్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా సిటీ -1 ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి టీంతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గణేష్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




