కమ్యూనిస్టులను లేకుండా చేసే కుట్ర

– కేంద్రం తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కూనంనేని 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: ‌కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే కుట్రతో కేంద్రంలోని పాలకులు యోచిస్తున్నారని, అందుకే మావోయిస్టులను సైతం డెడ్‌లైన్‌ ‌పెట్టి మరీ చంపుతున్నారని  సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ప్రకృతి సంపదను కార్పొరేట్‌ ‌శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ సర్కార్‌ ‌ప్రజల కోసమా అదానీ, అంబానీలాంటి కుబేరుల కోసమా తేల్చాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆపరేషన్ల పేరుతో సాగిస్తున్న నిర్బంధాలపై ప్రజా తిరుగుబాటు ఉద్యమాలు తప్పవన్నారు. మతాలు, కులాల పేరుతో కాషాయం పార్టీ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. అడవుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను కాజేసేందుకు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తూ మావోయిస్టు నేతలను హతమార్చడం సరైంది కాదన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని చెబుతున్నప్పటికీ ఈ మారణ హోమానికి తెగబడటం పైచాచికమని, మావోయిస్టుల హత్యలపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *