హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: రాష్ట్రంలోని పారా మెడికల్ కళాశాలల్లో చదివే దాదాపు 30 వేల మంది విద్యార్థుల ఫీజు స్టక్చ్రర్ వివరాలను ఈ-పాస్ లో వెంటనే అప్‌లోడ్ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారా మెడికల్ కళాశాలల్లో చదువుతున్న ఎస్.సి. ఎస్.టి, బీ.సి విద్యార్థులకు సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ ను 2024 -25 నుండి ఈ-పాస్ లో పెట్టనందున దాదాపు 30 వేల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోల్పోయే ప్రమాదం ఉందని పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ రావు, కార్యదర్శి మోహన్ రెడ్డి లు నేడు మంత్రి లక్షణ్ కుమార్ కు విజ్ఞాపన పత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ విషయంలో వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిన అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




