బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్

– బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు
– విజన్- 2047 లక్ష్యానికనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ
– మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గత బడ్జెట్‌లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్‌ అంశాలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో 2025-26లో బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, బీసీ హాస్టల్ నిర్వహణ, స్టడీ సర్కిల్‌లో శిక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్, కళ్యాణలక్ష్మి, రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, కాటమయ్య రక్షణ కవచాలు తదితర అంశాలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేవని, లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూసుకోవాలని, 2026-27 బడ్జెట్‌లో చేర్చాల్సిన అంశాలు, ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బలహీనవర్గాలు జీవన ప్రమాణాల మెరుగు, ఆర్థిక వృద్ధి సాధించేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టాలని, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఈ అంశాలపై చర్చించాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ ఆర్టీసీలో విజన్-2047కి అనుగుణంగా చేర్చిన అంశాలపై కా ర్యాచరణ తీసుకోవాలన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖలో స్థలాలు ఉండి కార్యాలయాలు లేని వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నా. ఆర్టీసీలో పెండింగ్ అంశాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశాల్లో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, ఎంజేపి సెక్రటరీ సైదులు, జెటిసిలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *