విద్యార్థుల సమస్యలు ప‌ట్ట‌వా?

– విద్యా శాఖ మంత్రీ మీరే అయినా ఉలుకు లేదు
– కమీషన్ల కోసమే యంగ్ ఇండియూ స్కూల్స్
– రేవంత్‌పై బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్ ధ్వ‌జం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గరుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీష్‌రావు విమర్శించారు. కల్తీ ఆహారం మాకొద్దు అంటూ రోడ్డెక్కిన నారాయణ్‌ఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. భోజనం బాగలేదని హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న ఉస్మానియా వర్సిటీలో రాత్రి నుంచి నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు.. ఇలాంటి సంఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతున్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉలుకు పలుకు లేదు అని ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు. ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేండ్లుగా చేసిన అభివృద్ది ఏముంది అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 62సార్లు దిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి సాధించిందేమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్‌తోనే తేటతెల్లమైందన్నారు. ఒకవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్ మరో వైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీసిండు అని ఆరోపించారు. గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం అంతర్జాతీయస్థాయి వసతులు కల్పిస్తదట అని ఎద్దేవా చేశారు. పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెల ల‌పాల్సిన‌ దుస్థితి కల్పించడమేనా ఇందిరమ్మ రాజ్యం.. ఉస్మానియా విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా మీ ప్రజాపాలన అని నిలదీశారు. రేవంత్‌రెడ్డీ.. పరిపాలన అంటే ప్రగల్భాలు పలకడం కాదు.. ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపించడం అంతకంటే కాదని హితవు పలికారు. హార్వార్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి వచ్చినా కూడా మీరు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రాధాన్యం చూపకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖపై దృష్టి సారించి గురుకుల విద్యార్థులకు పురుగుల్లేని భోజనం అందించాలని, ఉస్మానియా వర్సిటీ సమస్యలకు పరిష్కారం చూపాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *