– పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి : మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం తాజా విడతతో కలిపి మొత్తం రూ.646.36 కోట్లు రాష్ట్రానికి అందించినట్లు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలÅ£నుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అయితే 15వ ఆర్థిక సంఘం కింద సుమారు రూ.3,000 కోట్ల నిధులు రావాల్సి ఉండగా రూ.2,400 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల సమగ్రాభివృద్ధి, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





