– పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
– సన్న బియ్యం ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారింది
– ప్రజాపాలనపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరో మాటకు ఆస్కారం లేదని, యావత్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ ని మాత్రమే కోరుకుంటోందని స్పష్టం చేశారు. పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలు కోదాడ 14వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పురపాలక సంఘం ఎన్నికల్లో గేమ్ చెంజర్‌గా మారిందన్నారు. దేశ చరిత్రలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అర్హులైన నిరుపేదలకు ఉచితంగా చేస్తున్న నాణ్యమైన సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్లలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. అలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతుండడంతో ఈ పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయనుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వసనీయతను ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మాత్రమే అభివృద్ధి, సంక్షేమం అమలు జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో బలపడిందని, మరో ఎనిమిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన పునరుద్ఘాటించారు. పదేళ్ల బీఆరఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని, అందుకే విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




