మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్లోని బండబావి ప్రదేశంలో రూ.9 కోట్ల అంచనాతో తలపెట్టిన మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కార్పొరేటర్ గా ఐదేళ్లు పూర్తి చేసుకుని చివరి రోజు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే కార్యక్రమం చేపట్టడంపై మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కార్పొరేటర్ ప్రభుదాస్ ధన్యవాదాలు తెలిపారు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం తన పదవీకాలంలో చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి బండబావి నమూనా డిజైన్ ను పరిశీలించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, లక్ష్మారెడ్డి, విజయలక్ష్మి, శ్రీలత శోభన్ రెడ్డిలను కార్పొరేటర్ శాలువాతో సత్కరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




