– మరోసారి అధిక ధర పలికిన తొర్రూర్ భూములు
– చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు
– సుమారు రూ.56 కోట్లు ఆదాయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలో తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు భారీగా పాల్గొన్నారు. బాటసింగారం ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ వేలంపాట తొలి రోజున శనివారం 70 ప్లాట్లను విక్రయించారు. ఈ ప్రాంతంలోని భూములను గరిష్టంగా చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు చేశారు. తొర్రూర్‌తోపాటు ఓఆరఆర్‌కు సమీపంలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం విక్రయించిన భూముల ద్వారా సుమారు రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. తొర్రూర్‌లోని ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు దాదాపు 150మంది ముందుకొచ్చారు. వీరిలో అనేకమంది కుటుంబ సమేతంగా వచ్చి తమకు నచ్చిన ప్లాట్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. ఒక కార్నర్ ప్లాట్‌ను దక్కించుకోడానికి వేలం పాటలో 20సార్లకు పైగా ధరలు పెంచుతూ పోటీ పడటమే ఇక్కడి ప్లాట్లకు ఉన్న డిమాండ్‌కు నిదర్శనం. 200 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల చదరపు గజం కనీస ధర (అప్‌సెట్ ప్రైజ్) రూ.25 వేలుగా నిర్ణయించగా కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, రూ.43వేలు, రూ.41 వేలకు కూడా కొనుగోలు చేశారు. మొత్తంమీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి. కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జి.వి.రమణారెడ్డి, ఈఈ నరేందర్ రెడ్డితోపాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేలం పాట నిర్వహించారు. కాగా, తొర్రూర్ లే అవుట్‌లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
పోచారం, బండ్లగూడల్లో 71 ఫ్లాట్ల కేటాయింపు
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించిన ఫ్లాట్లలో 71 ఫ్లాట్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి లాటరీలో కేటాయించడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు రూ.11 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




