– ఇందులో ఈపీటీఆర్ఐ పాత్ర కీలకం
– సీఎస్ రామ కృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్ఐ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన తరగతులు, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు, పబ్లికేషన్స్ ప్రచురణలు మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఈపీటీఆర్ఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శనివారం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆరఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిశోధన, శిక్షణ, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. దీనిద్వారా అమలవుతున్న ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక అంశాలపై బోర్డు సభ్యులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకనుగుణంగా పర్యావరణ అనుకూల కార్యక్రమాలను వేగవంతం చేయాలని, వివిధ శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి, వాయు కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపకం వంటి అంశాల్లో ఈపీటీఆర్ఐ మరింత చురుకైన పాత్ర పోషించాలని చర్చించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, బోర్డ్ మెంబర్స్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





