గురుకులాలను గాలికొదిలేశారు

– ఇంటర్ విద్యార్థినికి పాముకాటు
– మృత్యువుతో పోరాడుతున్న అశ్మిత
– ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రేవంత్ రెడ్డి గారు, మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయా లా.. లేక విషసర్పాలకు ఆవాసాలా? అంటూ బీఆర్ఎస్ నేత హరీష్రావు ప్రశ్నిం చారు. మహబూ బాబాద్ జిల్లా ఇనుగుర్తి గురు కులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోంది. ముఖ్యమంత్రి గా, విద్యా శాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫ ల్యం కాదా? 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న మీరు గురుకు లాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు. చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేదు. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివ ర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే… ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమి ట్టాడుతున్నారన్నారు.తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా? లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా అని తల్లి దండ్రులు ఆవేదన చెందు తున్నారన్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి. విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలి. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందిం చాలి. రేవంత్ రెడ్డి గారు.. రాజకీయ కక్షసా ధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టండని హరీష్రరావు హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *