– పుష్కరఘాట్లు, రహదారుల విస్తరణపై దృష్టి
– త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలి
– దేవాలయాల్లో వసతులపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి
– రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ మరమ్మతులకు పెద్దపీట
– 2036 ఒలింపిక్స్ నాటికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలి
– విజన్ 2047 లక్ష్య సాధనలో భాగంగా అధికారులతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి
హ్యాండ్లూమ్స్, టెక్ట్సైల్స్ శాఖ ద్వారా చేనేత కళాకారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించాలని సూచించారు. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్టేష్రన్ల శాఖ సమీక్షలో భూ భారతి రికార్డుల నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, భూ సర్వేలు, సబ్ రిజిస్టార్ల కార్యాలయ భవనాల నిర్మాణం, ఇ-ఫైలింగ్, లైసెన్డస్ సర్వేయర్లు, 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యసాధన, తదితర అంశాలపై సక్షించారు. క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, సెట్విన్, రాష్ట్ర మ్యూజియమ్స్ అభివృద్ధి, ఆయా శాఖల పనితీరుపై సి.ఎస్ సమీక్షించారు. ప్రస్తుత కార్యక్రమాల అమలు స్థితి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికల, తెలంగాణ 2047 విజన్ లక్ష్య సాధన పై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో రాబోయే 2036 ఒలింపిక్స్ నాటికి రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడాకారులను అధిక సంఖ్యలో తయారు చేసే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యువజన సర్వీసులు శాఖ ద్వారా అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణ, యువత సంక్షేమ కార్యక్రమాలు లక్ష్య సాధనలో ఉండేలా పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. ముఖ్యంగా యువతలో క్రీడా ప్రతిభను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రోత్సహించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, కోచింగ్ సదుపాయాలు, ప్రోత్సాహకాలు, అవార్డులు, ఆర్థిక సహాయంపై సమీక్ష జరిపి ప్రతిభావంతులైన క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం కప్ వాట్సాప్ యాప్ ను ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో రాష్ట్రంలో ఉన్న చరిత్రాత్మక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించాలని అన్నారు. రవాణా, రోడ్లు భవనాలు శాఖ సమావేశంలో రాష్ట్ర రహదారుల నిర్మాణం, నిర్వహణ, ప్రభుత్వ భవనాల నిర్మాణ పురోగతి, నాణ్యత ప్రమాణాలు, ప్రజలకు అందిస్తున్న సేవల సామర్థ్యం తదితర అంశాలపై ప్రధాన కార్యదర్శి సమగ్రంగా సక్షించారు. రహదారుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమని, ముఖ్యంగా గ్రాణ, పట్టణ ప్రాంతాలను అనుసంధానించే రహదారుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో చేపట్టిన పలు ప్రభుత్వ ఆసుపత్రులు వరంగల్, ఎల్.బి.నగర్, ఆల్వాల్, సనత్ నగర్, న్యూ ఉస్మానియా, హైకోర్టు నూతన భవనం, భవన నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా శాఖకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించాలని, వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సులు, రహదారి భద్రత చర్యల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, మిషన్ భగీరథ శాఖల పనితీరు, గ్రాణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామ పంచాయతీల పనితీరు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఉపాధి హా పథకం అమలు పురోగతి, గ్రామీణ రహదారుల అభివృద్ధి, మహిళ సంఘాల బ్యాంక్ లింకేజ్, తదితర అంశాలపై సి.ఎస్ సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. పథకాల అమలులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పారదర్శకతను పాటించాలని అన్నారు. గ్రామాల్లో రానున్న వేసవి కాలంలో తాగు నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ముఖ్యకార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ కుమార్ సుల్తానియా, ఎన్. శ్రీధర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తీ, సెర్ప్ సీఈఓ దివ్య, పంచాయతీ రాజ్, గ్రాణాభివృద్ధి కమిషనర్ శృతి ఓఝా, స్టాంప్స్, రిజిస్టేష్రన్ ఐజి రాజీవ్ గాంధీ హన్మంతు, దేవాదాయశాఖ డైరెక్టర్ ఎస్.హరీష్, డైరెక్టర్ స్పోర్ట్సు సోనిబాలా దేవి, డైరెక్టర్ కల్చర్ నరసింహారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





