స్థానికంగా గెలిచే వారికే పార్టీ అండ

– రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి
– కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సూచన
– పార్టీ జూమ్ మీటింగ్‌లో అమెరికా నుంచి పాల్గొన్న సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. నామినేషన్ల పక్రియ పూర్తికావడంతో తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు, నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దని, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలని సూచించారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమేనన్నారు. రెబల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని, పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దష్టి పెట్టాలని, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మంత్రుల మధ్య అంతరం లేకుండా చూడాలి అని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను టీపీసీసీ చీఫ్ సీఎంకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ నిర్దేశించారు. కాగా, ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపై ఫిబ్రవరి 3 నుంచి పలు జిల్లాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో విస్తృతంగా పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *