పోలీసుల‌కు కౌశిక్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు

– ఉద్దేశ‌పూర్వ‌కంగా అన‌లేదు
– ప‌నిగ‌ట్టుకొని తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు
– ఈ వివాదాన్ని ఇంత‌టితో ముగించండి
– బీఆర్ ఎస్ ఎమ్మెల్యే  అభ్య‌ర్థ‌న

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. ’ఎవరినీ ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బ‌లంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్లో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను.’ అని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. వీణవంకలోని స్థానిక సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం వెళ్లారు. ఆ సమయంలో పోలీసులకు, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించింది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కౌశిక్ రెడ్డి.. పోలీసులకు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. తన క్షమాపణల అనంతరం ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *