టాలీవుడ్‌లో విషాదం

– గుండెపోటుతో సినీ సంగీత దర్శకుడు నల్లూరి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ టీవీ, సినీ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. టీవీ ధారావాహికలకు, స్పెషల్ ఎపిసోడ్స్‌కు సంగీతం అందించిన ఆయన ఎన్నో నంది అవార్డులను అందుకున్నారు. రెండున్నర దశాబ్దాలపాటు టీవీ, రేడియో రంగాలలో, చిత్రసీమలోనూ సంగీత దర్శకుడిగా రాణించిన నల్లూరి హైదరాబాద్ దూరదర్శన్ తొలినాళ్ళలో వందలాది పాటలను స్వరపరిచారు. పలు చిత్రాలకూ ఆయన సంగీతం అందించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ’అగ్ని ప్రవేశం’కు ఆయనే సంగీత దర్శకుడు. అలానే తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ’కూతురు’, ’అమ్మో అల్లుడా’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. 2024లో తారకరత్న హీరోగా నటించిన ’ఎస్ `9’ ఆయన సంగీతం సమకూర్చిన చివరి చిత్రం. మచిలీపట్నం మల్కాపట్నంకు చెందిన సుధీర్ కుమార్ నోబుల్ కళాశాల పూర్వ విద్యార్థి. యుక్త వయసులోనే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన మృ తికి పలువురు టీవీ, సినీ రంగాలకు చెందిన వారు సంతాపం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *