చైన్ స్నాచింగ్‌లపై వదంతులు నమ్మొద్దు

– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. ఇలాంటి ప్రచారాలపై ఆయన స్పందిస్తూ ఇదంతా ఉత్తిదే అని అన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమంటూ ’ఎక్స’లో ఆయన పోస్టు పెట్టారు. దయచేసి సోషల్ విÖడియాలో వచ్చే ధ్రువీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి.. భయాందోళనలు సష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి. విÖ భద్రతే మా బాధ్యత అని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *