మేడారం జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం

– కొద్దిసేపట్లో గద్దెకు సారలమ్మ రాక
– కన్నెపల్లిలో పూజలో పాల్గొన్న మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: కన్నెపల్లి గ్రామం నుంచి మేడారంలోని గద్దెకు వనదేవత సారలమ్మ బయలుదేరింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ సారలమ్మకు అడుగడుగునా భక్తులు నీరాజనం పట్టారు. కన్నెపల్లిలో పూజారులు జరిపిన సారలమ్మ ప్రత్యేక పూజల్లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కెకాన్‌ల్ణలు పాల్గొన్నారు. తల్లుల దర్శనానికి భక్తజనం తరలి వస్తూనే ఉన్నారు. తల్లుల రాకకు గద్దెల ప్రాంగణం ముస్తాబైంది. కొద్దిసేపట్లో సారలమ్మ, పగిడిద్దరాజులు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోనున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో తల్లులకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. కన్నేపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు గుండా పూజారులు తీసుకొని వస్తున్నారు. కాగా, భక్తులతో మేడారం జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయంది. క్యూ లైన్లు నిండిపోయాయి. సారలమ్మ రాకకు గద్దెల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వన దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రి అడ్లూరి

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28:వన దేవతలు సమమ్కక్క‌ సారలమ్మ‌ల‌ను గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ బుధ‌వారం ద‌ర్శించుకున్నారు. అలాగే ములుగు ప్రిన్సిప‌ల్ మేజిస్ట్రేట్ కోర్టు జ‌డ్జి జ్యోత్స్న కూడా త‌ల్లుల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు త‌ల్లుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *