– అద్దె భవనాల్లోని కార్యాలయాలను మార్చడంపై సీఎం స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఈ విషయమై ఫోన్ చేసి మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్‌ను ప్రత్యేక స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ కేటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్‌లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి
ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





