– ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఫంక్షన్ హాల్స్
– పాలకుర్తిలో ప్రారంభించిన మంత్రి సీతక్క
జనగాం/పాలకుర్తి, ప్రజాతంత్ర, జనవరి 23 : మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పాలకుర్తి పట్టణంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించి, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక శాసనసభ్యులు యశస్విని రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ తప్పనిసరిగా ఎస్చ్లో సభ్యత్వం తీసుకుని వివిధ వ్యాపారాల్లో భాగస్వామ్యమై ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎసాచీ సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టించే బాధ్యతలు అప్పగించి ఉపాధి కల్పించామని, ధాన్యం కొనుగోలు బాధ్యతను కూడా ఎన్‌హెచ్ జీ సభ్యులకు అప్పగించామని తెలిపా రు. మహిళలు ఎప్పటికీ ఎవరి మీద ఆధారప డకుండా నిలబడేలా ప్రభుత్వం రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తోందని చెప్పా రు. ఇందిరమ్మ ఇల్లు పథకంలో ప్రతి నిరుపేద మహిళకు సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మహిళల పేర మీదే ఇళ్లను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మేడారం జాతరలో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యాపారాల్లో ఎదిగేందుకు అవకాశాలు కల్పించామని, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మొబైల్ వ్యాన్లు, ఫంక్షన్ హాళ్ల అప్పగింతల ద్వారా మహిళలను ప్రతి వ్యాపార రంగంలో భాగస్వాములను చేస్తు న్నామని వివరించారు. ఎస్ హెచ్ జీ సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుం బానికి రూ.10 లక్షల భీమా సొమ్ము, లోన్ భీమా కింద రూ.2 లక్షలు అందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలతో నాణ్యమైన చీరలు తయారు చేయించి గ్రామీణ, పట్టణ మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశామని చెప్పారు. ఆడపిల్లలను భయప డకుండా చదివించి ఉన్నత కెరీర్లో నిలబెట్టే బాధ్యత తల్లిదండ్రులదేనని, ఈ విషయంపై ఎస్ హెచ్ జీ సభ్యులు గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. ఒక ఇంటి మహిళ బాగుంటే కుటుంబం బాగుప డుతుంది అని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జనగాం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక శాస నసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. జనగాం బైపాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెన్ శిల్పాలు, బస్టాండ్ చౌరస్తా జంక్షన్ వద్ద సూర్య నమస్కారాల శిల్పాలను ఆవిష్కరించారు. బతుకమ్మ కుంటలో చేపట్టిన అభివృద్ధి పనులు, మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తయిన ఆర్ అండ్ బి బంగ్లా, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభించారు.
సీతక్క పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట
జనగామ, ప్రజాతంత్ర,జనవరి 23: జనగామలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో ఇరు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆహ్వానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట చేసుకుంది. ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





