– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: అన్ని రంగాల్లో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్నట్లే క్రీడారంగంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025-26’ నిర్వహణలో భాగం> ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో, అటల్ బిహారీ వాజ్?పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎల్బీ స్టేడియంలో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో దాదాపు 35 వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని, ఈ మహోత్సవంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో తదితర పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఒకవైపు డ్రగ్స్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో దానిని కట్టడి చేయడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అందుకే విద్యార్థులు, యువతను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని పార్టీ పదాధికారులకు అధ్యక్షుడు రామచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కమిటీల పనితీరుతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలల ఫలితాలను అధ్యక్షుడు రామచందర్‌రావు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అనుబంధ విభాగాల పనితీరుపై కూడా రాంచందర్ రావు గారు సమీక్ష చేశారు. పార్టీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సింగరేణి, నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. సీబీఐ ద్వారా గత బీఆరఎస్ ప్రభుత్వ కాలం నుండి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలనేది బీజేపీ డిమాండ్ అని చెప్పారు. ఇప్పటికి రెండుసార్లు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై , ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో అనే విషయాలు వైట్ పేపర్ (శ్వేతపత్రం) విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





