కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా

– నాటి పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించా
– ధరణి స్థానంలో భూభారతి తెచ్చాం
– సమస్యలుంటే 1912కు కాల్ చేయండి
– లక్ష్మీబాయి, గంగు భాయ్ లకు ప్రజాభవన్ కు ఆహ్వానం
– ఉప‌ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: మీరంతా కోరుకున్న‌ట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఈ నేప‌థ్యంలో కృతజ్ఞతలు తెలవడానికి తాను వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జంగంలో గురువారం ఏర్పా టు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ ప్ర‌భుత్వం మీ సమస్యలు తీరుస్తుంద‌న్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ స్పార్ట్స్ పాదయాత్రలో భాగంగా ఆనాడు ప్రతిరోజు నన్ను కలిసిన వారిని, వారు విజ్ఞ ప్తి చేసిన సమస్యలను వివరంగా రాసుకున్నాన‌న్నారు. 2023 మార్చిలో ఆయ‌న ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఖమ్మంలో ముగించిన సంగ‌తి తెలిసిందే. కాగా బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నానని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు. 2023 మార్చిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో గిరిజనులు అటవీ భూముల హక్కులు, సాగు సమస్యలను వివరించారు. వారికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరా సౌర గిరిజల వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చామన్నారు.  అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులు సాగు చేసుకునేందుకు వారికి పట్టాలు ఇచ్చాం, ఆ భూములు సాగు చేసుకునేందుకు విద్యుత్ సరఫరా విషయంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఇందిరా సౌరగిరి జలవికాసం పథ కాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే ఈ పథకాన్ని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రారంభించామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ధరణి స్థానంలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 నెంబర్ కు కాల్ చేస్తే విద్యుత్ అధికారులే మీ వద్దకు వచ్చి 24 గంటల్లో ఒక వాహ నంలో వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.  పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్  స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఉట్నూరు ఆసిఫాబాద్ రహదారి వెడల్పుకు పాదయాత్ర సమయంలో విజ్ఞప్తి చేశారు మీ అందరి కోరిక మేరకు ఆ పనిని మంజూరు చేసి హ్యామ్‌ పథకంలో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నట్లు తెలిపారు. ఉట్నూరు కరిమెరి రోడ్డు వెడల్పు, అనార్పల్లి వంతెన నిర్మాణం కోసం అడిగారు వాటిని మంజూరు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓజా తెగ తయారు చేసే హస్తకళల వస్తువులను ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ ద్వారా మార్కెటింగ్ చేసేవారు గత పది సంవత్సరాలు పట్టించుకోలేదని విజ్ఞప్తి చేశారు. మీ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం రాగానే మీ వృత్తిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ప్రభుత్వం గుర్తించిందని, చేతి పనిముట్లకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.

ప్రజాభవన్ కు భోజనానికి రావాలి

భట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన స‌మ‌యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దేవుగూడ గూడెంలో లక్ష్మీబాయి, గంగు భాయ్ ఆయ‌న‌కు ఆనాడు భోజనం పెట్టడమే కాదు, తనతో పాటు కొన్ని కిలోమీటర్ల మేర నడిచారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న డిప్యూటీ సీఎం తిరిగి ఆ గూడానికి వెళ్లారు. వారందరినీ పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని నాటి ఫోటోలు చూపిస్తూ ఆనాటి విషయాలను గుర్తు చేశారు. వారిద్దరిని హైదరాబాద్ లో నేను ఉంటున్న ప్రజాభవన్ కు భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారు హైదరాబాద్ కు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. వారు చెప్పిన సమస్యల గురించి ప్రస్తావించారు. ఇళ్ల సమస్య, డ్రైనేజీ వాటర్ సమస్య, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలను, విద్యుత్ పరిష్కరించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన గూడెం గ్రామస్తులతో భేటీ అయ్యారు. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, పిఎసిఎస్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *