తరతరాల విశ్వాసం.. గిరిజన బిడ్డల పోరాటం

– సమ్మక్క త్యాగమే గిరిజన ఆధ్యాత్మిక సమాగమానికి మూలం
– గిరిజన ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం
– వారి సంస్కృతికి గుర్తింపు
– మహా జాతరకు మూడు కోట్లమంది వస్తారని అంచనా
– సకల ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 22: అడవు ల్లో పుట్టిన ఒక గిరిజన మహిళ పోరాటం తరతరా ల విశ్వాసంగా మారింది. రాజ్యాధి కారం, దోపిడీకి ఎదిరించిన సమ్మక్క త్యాగ మే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక సమాగమంగా మారింది. అదే సమ్మక్క.సారలమ్మ మేడారం జాతర. ఇది కేవలం ఒక పండుగ కాదు, గిరిజన ఆత్మగౌరవానికి నిలు వెత్తు సాక్ష్యం. కాకతీయుల కాలంలో కోయ గిరిజన సమాజానికి చెందిన సమ్మక్క సామం తుల అన్యాయానికి ఎదిరించి పోరాడింది. ఆ పోరాటంలో ఆమె అడవుల్లో అంతర్ధానమైందన్న విశ్వాసమే దేవతారూప ఆరాధనకు నాం ది పలికింది. సమ్మక్క కుమార్తె సారలమ్మ, కుమారుడు జంపన్న కూడా తల్లి బాటలోనే ప్రజల కోసం పోరాడి వీరమరణం పొందారనేది గిరిజనుల కథనం. అందుకే మేడారంలో విగ్రహాలు ఉండవు గద్దెలే దేవతల నివాసాలు. వేదమంత్రాలు ఉండవు. -రిజన సంప్రదాయాలే పూజలు. బెల్లం నైవేద్యం, కుంకుమ, పసుపు, కోళ్ల బలి, వెదురు గద్దెలు ఇవే మేడారం జాతర ప్రత్యేకతలు రెండేళ్ల కోసారి జరిగే ఈ జాతరలో లక్షల కాదు, కోట్ల మంది భక్తులు పాల్గొంటున్నారు. అడవుల్లో మొదలైన ఆరాధన నేడు దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి గుర్తింపుగా నిలిచింది. కేవలం తెలు గు రాష్ట్రలే కాకుండ, ఛత్తీస్గగర్.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా వంటి చుట్టుపక్కల రాష్ట్రల నుండి లక్షల్లో భక్తులు ప్రతి రెండేండ్లకు ఇక్క డికి చేరుకొని తమ కోరికలు తీర్చమని వరదేవ తలకి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇం తటి గొప్ప జాతర కి 1996 లో వాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాని కల్పించింది. ఈ సంవత్సరం జరిగే జాతరకి గతం లో ఎప్పుడు లేనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లని కేటాయించి మా స్టర్ ప్లాన్ ద్వారా జాతర గద్దెల ప్రాంగదాన్ని ఆధునీకరించింది. కొన్ని వందల సంవత్సరాలు మన్నికగా ఉండేలా పూర్తి రాతి కట్టడాలతో ఈ సారి మేడారం జాతర భక్తులకి కనువిందు చేయనుంది. రాతి కట్టడాలపై చిత్రీకరించిన ఆదివాసీ సంస్కృతికి చెందిన బొమ్మలు గిరిజన జాతి అచరాలకి అద్దంపడుతున్నాయి. గత జాతరకి 2 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు చెందిన పనులు ను దాదాపు 6 నెలల ముందే ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పంచాయత్ రాజ్ శాక మంత్రి సీతక్క పర్యవేక్షణ లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సారథ్యం లో ఈసారి మేడారం పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్న‌ది. 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను, కొండాయి నుంచి గోవింద రాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతం ప్రారంభం అవుతుందని, జనవరి 29న పా యంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెల పైకి తీసుకువస్తారు. జన పది 306 వన దేవతలకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జనవరి 31న సాయం త్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ దేవతలు గోవింద రాజు, పగిడిద్ద రాజు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

మ‌హా జాతరకు సర్వం సిద్ధం

ఈసారి జాతరను విజయవంతంగా నిర్వహిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయి. లో ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహణను సాధారణ పండుగగా కాకుండా ఒక మహా పరిపాలనా కార్యాచరణగా రూపాం రించారు. భక్తుల రాకపోకలు, భద్రత, మౌలిక వసతులు, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాల్లో ఎక్కడా లోటు లేకుండా చూడాలనే లక్ష్యంతో మొత్తం 21 శాఖలను భాగస్వాములు గా చేసుకుని సమన్నయ చర్యలు కొనసాగు తున్నాయి. జాతర ప్రాంతాన్ని పరిపాలనా జోన్లు, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్ కు జిల్లా స్థాయి అధికారిని జోనల్ అధికారిగా, ప్ర & సెక్టార్కు మండల స్థాయి అధికారిని నియ మించారు. జాతర కాలంతో పాటు ముందస్తు ఏర్పాట్లు, అనంతర నిర్వహణను దృష్టిలో పెట్టు కుని మొత్తల 42,027 మంది సిబ్బందిని విధుల్లోకి దింపారు. రహదారులు, పార్కింగ్లపై దృష్టి భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో రహదా రులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిం చారు. జాతీయ రహదారులు, అద్దం పంచాయతీరాజ్ శాఖం పరిధిలో మొత్తం 525 రహదారి సంబంధిత సమస్యలను గుర్తించి అన్నీ సమస్యలకు పరిష్కారం చూపారు. మొ త్తం 49 రహదారుల్లో మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టగా, 10 కొత్త రహదారులు 3 కొత్త కల్యర్థులు నిర్మించారు. వాహనాల నియం త్రణ కోసం ఏకదిశ, ద్విదిశ రూట్లను స్పష్టంగా గుర్తించి ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అములు చేస్తున్నారు. పార్కింగ్ అవసరాల కోసం మొ తం 42 ప్రదేశాల్లో 1,418 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించారు. ఇందులో 235 ఎకరాలు ఇటబీ శాఖ పరిధిలో, 1,183 ఎకరాలు గిరిజన సంక్షే మ శాఖ పరిధిలో ఉన్నాయి. కొన్ని చోట్ల పంట కోత ఆలస్యం, నీటి ముంపు వంటి సమస్యలు ఎదురైనా, సంబంధిత శాఖలు రైతులతో సమ స్వయం చేసుకుంటూ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నా యి.రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జాతర పనుల కోసల రూ.202.70 కోట్ల వ్యయంతో 24 ప్రధాన పనులు చేపట్టారు. గద్దెం పుడ ర్నిర్మాణం. నాలుగు లైన్ల రహదారుల అభివృద్ధి. ప్రధాన జంక్షన్ల సుందరీకరణ, హెలిప్యాడ్ల మర మృతులు వంటి కీలక పనులు ఇందులో ఉన్నా యి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వా దా 84 పనులు చేపట్టగా, వీటి వ్యయం రూ.53.21 కోట్లుగా ఉంది. రహదాద్రి మరమ్మతులు, క్యూ లైన్ షెడ్లు, సుందరీకరణ పరులు వున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజి నీ రింగ్ శాఖ ద్వారా చేపట్టిన పార్కింగ్ అభి వృ ది. గిరిజన మ్యూజియం మరమ్మతులు వంటి పనులు కూడా పూర్తయినట్లు వెల్లడించారు.

మిషన్ భగీరథ కీలక పాత్ర

భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించడంలో మిషన్ భగీ రథ కీలక పాత్ర పోషిస్తోంది. జాతర ప్రాంతం లో 517 బోటీ కేంద్రాలు, 47 సిస్టర్ను 312 ట్యాపులు, 10 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,700 మరుగుదొడ్లు, 265 టాయి లెట్ బ్లాకులు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ సర ఫరా విషయంలో ఎలాంటి అంతరాయం లే కుండా చూడటానికి టీజీఎన్పీడీసీఎల్ విస్తృత చర్యలు చేపట్టింది. జాతర ప్రాంతంలో 911 విద్యుత్ స్థంభాలు, 196 ట్రాన్స్ ఫార్మర్లు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొబైల్ కమ్యూనికేషన్ కోసం 60 సెల్ టవర్లు, 33 సెల్ ఆన్ వీల్స్, 450 వీహెచ్ఎఫ్ సెట్లు ఏర్పాటు చేసి అన్ని ప్రధాన నెట్ వర్క్ ద్వారా పూర్తి కవరేజ్ కల్పిం చారు. రవాణా కోసం టీజీఎస్ఆర్టీసీ ఈసారి చరిత్రలోనే అతి పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 4,000 బస్సులు, $1,000 ట్రిప్పులు దడపాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సాదిను దరు ఇరవై లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైద్య సేవల పరంగా 5,192 మంది వైద్య సి బ్బందితో పాటు 108 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నా రు. అగ్నిమాపక భద్రత కోసం 15 ఫైర్ ఇంజిన్లు, 268 మంది ఫైర్ సిబ్బంది, జంపన్న వాగులో భద్రత కోసం 210 మంది ఈతగాళ్లు ఎస్.డి. ఆర్ ఎఫ్ బృందాలను మోహరించారు. భక్తుల సౌకర్యం, భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్రంగా నిర్వహిం చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తోంది. అన్ని శాఖల సమన్వయం, కాలపరిమితిలో పనుల పూర్తి లక్ష్యంతో ఈ మహా జాతరను మరోసారి ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలపాలనే దిశగా పాలన
ముందుకు సాగుతోంది.

డిజిటల్ టెక్నాలజీ వినియోగం

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా మేడారం జాతర-2026కు ఈసారి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట వేసింది. మహాజా తరలో సమాచార లోటు లేకుండా చూడాలనే ఉద్దేశంతో మేడారం జాతర 2026 పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రారంభించడంతో పాటు మేదారం జాతర వాట్ కాం అనే అధికారిక వెబ్సైట్ ప్రారంభించింది. అదే బిధంగా ప్రత్యేకంగా మై మేడారం చాట్సాప్ చాల్బాట్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ బాట్బాలు వినియోగించుకో వలంటే భక్తులు 7658912300 నెంబర్ తమ ఫోన్ లో సేవ్ చేసి వాట్సాప్ లో హాయ్ అని టైపు చేయడం ద్వారా ఈ సేవలు వాడుకో వచ్చు, చాలా ్బట్ సేవలు ఆంగ్లం తెలుగులో
అందుబాటులో ఉండేలా అధికారులు దీనిని తయారు చేశారు. మేడారం జాతర యాప్లో భక్తులకు అవసరమైన అన్ని సేవలను ఒక్క క్లిక్ వైద్య బడించేంది. గరిక ప్పుడు రైడ్ అంటనట్లే 108 న్సుల లోకేషన్లు, మిస్సింగ్ పర్నన్స్ క్యాంపులు, బాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాలు, తాగునీటి చలివేంద్రాలు, వ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వంటి కీలక సదుపాయాల వివరాలు స్పష్టంగా చూపిస్తున్నా రు. దేవతల గద్దెల చలనం, ఆలయ స్థానం, ప్రధాన బ్యాండ్ మార్కులు మ్యాప్ రూపంలో. అందుబాటులో ఉండటంతో భక్తులు దారితప్పే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేశారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ యాప్ ప్రత్యేక సేఫ్టీ మాడ్యూల్ను రూపొందించారు. ఇత్యమసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కగానే సహాయం కోరే ఎస్ ఓఎస్ అలర్ట్, సంఘటనల నివేదిక, ఫిర్యాదుల నమోదు. తప్పిపోయిన వ్యక్తుల సమాచారం, మిస్సింగ్ కేసులు వివరా. లు వంటి అంశాలను ఒకే చోట పొందుప రిచారు. ప్రత్యేక హెల్ప్ ద్వారా భక్తులకు తక్షణ మార్గనిర్దేశం అండేలా వ్యవస్థను సిద్ధం చేశారు. ఇక మేడారం 2025 వెబ్ సైట్. లాట్బాట్ జాతర తేదీలు, సేవల లొకేషన్లు, రవాణా సూచనలు, అత్యవసర సహాయ వివరాలపై భక్తులు అడిగే ప్రశ్నలకు చాటీబాటి వెంటనే సమాధానాలు ఇస్తోంది. అధికారిక సమాచారమే అందేలా ఈ వేదికలను రూపొం దించడంతో వదంతులు, అపోహలకు తాపు లేకుండా చేయాలనే ఉద్దేశం తో దీనిని తయా రు చేశారు. మేదారం జాతర-2026ను సంప్ర బాయ విశ్వాసంతో పాటు ఆధునిక సాంకేతి కతని మేళవించి మహా నిర్వహణగా నిలిపేందు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భక్తుల ఐర చేతిలోనే జాతర సమాచారాన్ని ఉండేలా. రూపొందించిన ఈ యాప్, వెబ్సైట్ ఈసారి మేడారాన్ని నిజంగా ఒక డిజిటల్ మహాజాతరగ మార్చామన్నాయి.

ప్లాస్టిక్ రహిత మేడారం

మేడారం అడవులు కోయా గిరిజన తెగకు చెందిన సాంప్రదాయ వైద్య స్థానానికి అమూ లమైన భాండాగారంలాంటివనీ చర్మవ్యాధుల నుంచి మధుమేహం వరకు వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి కోయా గిరిజనులు ఉపయో గించే 96కి పైగా ఔషధ వృక్ష జాతులను ఈ అడవులు నిలయంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదివాసీ విశ్వాసంలో” అడవి నాశనం అయితే దేవతలు కోపిస్తారు. అదే భావన ఉంది. ఈ నేపథ్యంలో, ప్లాస్టిక్ వంటి సహజ విరుద్ధ పదార్థాలు మేడారం పరిసరా ల్లోకి రావడం ఒక అసహజ పరిణామంగా అది వాన్ పెద్దలు భావిస్తారు. సమ్మక్క సారలమ్మ దేవతలు అరణ్యాల్లో నివసించే వనదేవతలు. వారి గద్దెలు కూడా అటవీ మధ్యనే ఉన్నాయి. ఇటువంటి విలువైన ప్రచారం ప్రకృతిని కపాడు కోవాల్సిన అవసరం ఉందని పంచాయతీ రాజ్,. స్త్రీ కిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజలకు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *