– ట్రంప్ వ్యాఖ్యాలపై దుమారం
– జాతీయ భద్రతా మండలిలో వీటిపై పుతిన్ కౌంటర్
మాస్కో, జనవరి 22: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ భద్రతకు చైనా, రష్యా నుంచి ముప్ప్పు పొంచి ఉందని చేసిన ఆరోపణలను మాస్కో తిప్పికొట్టింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సమావేశంలో పుతిన్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ’గ్రీన్‌లాండ్‌లో ఏం జరుగుతున్నదో మాకు అనవసరం. మొదటినుంచి గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఒక చిన్న ప్రాంతంగానే చూసింది. ప్రస్తుతానికి ఈ అంశంపై ఎవరికీ పట్టింపు.. ఆసక్తి లేదని నా ఉద్దేశం అని పుతిన్ చెప్పారు. ఎవరెన్ని రకాలుగా బెదిరించినా ఈ విషయంలో రష్యా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రీన్‌లాండ్ వ్యవహారం అమెరికా, డెన్మార్క్‌లు కలిసి పరిష్కరించుకుంటాయని పుతిన్ చెప్పారు. 1917లో డెన్మార్క్.. వర్జిన్ దీవులను అమెరికాకు విక్రయించింది. 1867లో రష్యా.. అలస్కాను యూఎస్‌కు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గాజాలో యుద్దాన్ని అంతం చేయడానికి ట్రంప్ ప్రతిపాదించిన ’బోర్డ్ ఆఫ్ పీస’పై కూడా పుతిన్ స్పందించారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందిన పత్రాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ శాంతి భద్రత కోసం చేసే ప్రయత్నాలకు రష్యా ఎప్ప్పుడూ మద్దతిస్తుందన్నారు. గాజా శాంతి ప్రణాళికకు 1 బిలియన్ డాలర్ల సొమ్ము విరాళంగా ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





