మంచిర్యాల, ప్రజాతంత్ర, జనవరి19: జిల్లా లోని చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ ను, అధికారులను భూ నిర్వాసితులు నిలదీశారు. నూతన ఏటీసీ అడ్వాన్స్ టైనింగ్ సెంటర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భూనిర్వాసితులు మాట్లాడుతూ ఏటీసీ భవన నిర్మిస్తున్న ప్రాంత భూములు తమవని తమకు కనీస సమాచారం లేకుండా భూములను ప్రభుత్వం లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కలెక్టర్ భూనిర్వాసితులపై మండిపడ్డారు. ఈ భూముల న్ని ప్రభుత్వ భూములని, ఎలా రిజిస్ట్రేషన్ చేసు కున్నారని ప్రశ్నించారు. ఎవరికి డబ్బులు ఇచ్చారు. వాళ్లని అడగాలని మండిపడ్డారు. అదేవిధంగా చెన్నూరు పట్టణంలో చెన్నూరు మున్సిపా లిటీలోని పలు వార్డులలో అభివ ద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వచ్చిన మంత్రికి మహిళలు నిలదీశారు. తమకు సంక్షేమ పథకాలు రావడం లేదంటూ మండిపడ్డారు. పట్టణంలో సరైన రోడ్లు, నాళాలు త్రాగునీటి వసతులు లేవని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




