– పదేళ్లుగా కోరుతున్నా పట్టించుకోని కేంద్రం
– 8 మంది ఎంపిలు ఉన్నా అన్యాయమే
– కేంద్ర మంత్రులకు అనేక లేఖలు రాసినా శూన్యం
– మరోమారు కేంద్ర మంత్రి గిరిరాజ్‌కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షాపూరిత వైఖరిపై బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు డిమాండ్ నిన్నమొన్నటిది కాదని, గత పదేళ్లుగా తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. గతంలో మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా, పూర్వపు టెక్స్ టైల్ శాఖ మంత్రులకు రాసిన అనేక లేఖలు, అనేక వ్యక్తిగత సమావేశాలు, అధికారిక విజ్ఞప్తులు ఇప్పటివరకు కేంద్రం నుండి ఎటువంటి సా నుకూల నిర్ణయానికి నోచుకోకపోవడం అన్యాయమన్నారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరా నీ మొదలుకొని నేటి మంత్రి వరకు ప్రతి ఒక్కరినీ బతిమిలాడాం. రాష్ట్రం నుంచి గెలి చిన బీజేపీ ఎంపీలు, కేంద్ర కేంద్రం వివక్షకేవలం ఉత్సవ విగ్రహాల్లా మారారన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఉన్నా సిరిసిల్ల నేతన్నల గోడును వినిపించడంలో వారు విఫలమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. వచ్చే కేంద్ర బడ్జెట్లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను అధికారికంగా ప్రకటించి ఈ పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. సీపీసీడీఎస్ నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలున్నాయని కేంద్ర బృందాలే ధ్రువీకరించినా పక్కనపెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు. తె లంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నల పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయలాంటిదని పేర్కొన్నారు. సిరిసిల్లలో 30 వేలకు పైగా పవర్ లూమ్స్ కలిగి ఉండి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మిక శక్తి ఉన్న ఇతర రాష్ట్రాలలోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన కేంద్రం అన్ని అర్హతలున్న సిరిసిల్లను పక్కనపెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెగా క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీరు, సింగిల్ విండో అనుమతులు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాలు.. ఇలా ప్రతి ఒక్క అర్హతను పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయని పదేపదేచెబుతున్నా ఎటువంటి సాంకేతిక లేదా ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటు అని ఎండగట్టారు. ఒకవైపు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్బర్ భారత’ అని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, తెలంగాణ విషయంలో ద్వంద నీతికి, చిత్తశు ద్దిలేమికి అద్దంపడుతుందన్నారు. Sష్టంలో కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మళ్లీ ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆరఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. కానీ నేడు పరిస్థితులు మారుతున్నాయి. ఇటువంటి కీలక సమయంలో కేంద్రం జోక్యం చేసుకుని మెగా క్లస్టర్‌ను మంజూరు చేయాల్సి ఉండగా తీవ్రమైన జాప్యం చేయడం నేతన్నల పొట్ట కొట్టడమే అవుతుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




