హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు ప్రజల జీవన విధానానికి, గ్రామీణ సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఏడాదిపాటు రైతు చేసిన కష్టానికి ఫలితం దక్కే ఈ పర్వదినం కుటుంబాలను, గ్రామాలను, సమాజాన్ని ఒక్కటిగా కలిపే మహత్తర ఉత్సవం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సందర్భం ఆశావహమైన కొత్త ఆరంభాలకు సంకేతంగా నిలుస్తుంది. పండుగ వేళ దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల పాత్రను అందరం గుర్తు చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తీసుకొచ్చిన పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయి. సంక్రాంతి మనకు కేవలం పండుగ మాత్రమే కాదు.. క్రమశిక్షణ, కృషి, సహకారం వంటి విలువలను గుర్తు చేసే సందర్భం. యువత విద్యలో, నైపుణ్యాల్లో ముందుకు సాగాలి. మహిళలు స్వావలంబనతో కుటుంబం, సమాజ పురోగతికి మరింత బలం చేకూర్చాలి. సంప్రదాయాలను కాపాడుకుంటూ, అభివృద్ధి మార్గంలో కలిసి నడిస్తేనే తెలంగాణ, దేశం మరింత బలపడతాయి. ఈ శుభవేళ ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





