37 నుంచి 40 దాకా ఉల్లంఘనలే ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ ఘనత

విచిత్రమేమంటే ఇది ఒప్పందం కాదు. చట్టం కాదు, కేవలం ఒక హామీ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల రెడ్డి నాయకత్వంలో నలుగురు పెద్ద మనుషులు, తెలంగాణ తరఫున మరో నలుగురు పెద్దమనుషులతో ఒప్పందం ఇది. ఎన్నో ఒప్పందాలను ఉల్లంఘించారు. ఒప్పందం మీద నమ్మడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీన మోసం చేసిందని విమర్శలు వచ్చాయి. 

‘‘1956 పెద్దమనుషుల ఒప్పందంలో బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషించారు, ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య జరిగింది. ఈ ఒప్పందం తెలంగాణకు రక్షణలు కల్పించి, వివక్షను నివారించే లక్ష్యంతో 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు ప్రాంతాల నాయకుల మధ్య కుదిరింది, దీని ద్వారా విద్య, ఉద్యోగాలు, ఆర్థిక ప్రణాళిక వంటి అంశాలపై రక్షణలు ఏర్పాటు చేయబడ్డాయి’’ అని నమ్మారు.  

ఒప్పందం వివరాలు: తేదీ: 1956 ఫిబ్రవరి 20. ప్రదేశం: ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్.

  • పాల్గొన్నవారు: ఆంధ్ర మరియు హైదరాబాద్ రాష్ట్రాల నుండి ఒక్కొక్కరి నుండి నలుగురు చొప్పున నాయకులు (మొత్తం 8 మంది).
  • ముఖ్య పాత్ర: ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల రెడ్డి సంతకం చేశారు. 
  • ముఖ్య ఉద్దేశ్యం: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంతానికి వివక్ష చూపకుండా ఉండటం.
  • ఈ ఒప్పందం తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టం, దీనిని తరువాత పార్లమెంటులో నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్‘ (Note on Safeguards)గా ప్రవేశపెట్టారు

ఒప్పందంలోని ముఖ్య అంశాలు (రక్షణలు):

  • ప్రాంతీయ నిధులు: కనీసం ఐదేళ్లపాటు, ప్రాంతాల వారీగా వసూలైన రెవెన్యూను ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాలి.
  • ప్రాంతీయ కమిటీ: తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ నిలకడ కమిటీ (Regional Standing Committee) ఏర్పాటు చేయాలి.
  • విద్య: తెలంగాణలో విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలి.
  • ఉద్యోగాలు: సివిల్ సర్వీసుల నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
  • హైకోర్టు: హైకోర్టు ప్రధాన పీఠం హైదరాబాద్‌లోనే ఉండాలి.

వివరమైన ప్రదానమైన అంశాలు

  • కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవెన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
  • తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
  • సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
  • ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.
  • రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
  • ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
  • తెలంగాణాలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
  • తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
  • కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైందని అనుకున్నారు. 

ఒప్పందంలో సంతకాలు చేసిన ముఖ్యమంత్రి తదితర ముఖ్యులు వీరు. ఇతర ఆంధ్రానాయకులు సంజీవరెడ్డి, సర్దార్ జి లచ్చన్న, సత్యనారాయణరాజు గార్లు.

బెజవాడ గోపాల రెడ్డి 1955‌-56 ముఖ్యమంత్రి

 1956 పెద్దమనుషుల ఒప్పందంలో సంతకాలు చేసిన 8 ముఖ్యులైన వారిలో ముఖ్యమంత్రి మొదటివారు,  నెల్లూరుకు చెందిన  శ్రీ బెజవాడ గోపాలరెడ్డి (1907-1997) గారు. ఆయన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రాజకీయవేత్త పరిపాలనాదక్షుడు, అని ‘ఆంధ్ర టాగోర్’గా ప్రసిద్ధి చెందారు. ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా (1955-1956) పనిచేశారు, అంటే విశాలాంధ్ర ఏర్పడానికి ముందు. కేంద్రంలో మంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌ గా ఉన్నారు.ముఖ్యంగా టాగోర్ రచనలను తెలుగులోకి అనువదించారు గోపాల రెడ్డి గారు. పదకొండు భాషలలో పండితులు, గొప్ప రచయిత, వక్త. 1956లో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తరువాత 1957లో ఆర్థిక మంత్రి. 

తెలంగాణ పక్షాన సంతకం చేసిన పెద్ద మనుషులలో మరొక ప్రముఖుడు బూర్గుల రామకృష్ణారావు గారు (1899-1967) నిజాం నిరంకుశ పాలనపై పోరాడినవారు. స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, బహుభాషావేత్త రాజకీయవేత్త, హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (1952-1956). (చివరి ముఖ్యమంత్రి కూడా). పోలీసు చర్య తర్వాత ఏర్పడిన వెల్లోడి ప్రభుత్వం (1950)లో ఆయన రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1952లో జరిగిన

తొలి సార్వభౌమ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం కు గెలిచారు.  జాగీర్దారీ వ్యవస్థ రద్దు, భూ సంస్కరణలు అమలు చేశారు, భూదాన ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీష్ వంటి పలు భాషలలో పండితులు, కవి, అనువాదకుడు. పి వి నరసింహారావుగారు గురువు అని పేరు గలిగిన వారు.

మరో రాజకీయ నాయకుడు, తొలి ఉపముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డి (కొండా వెంకట రంగారెడ్డి) (1890-1970) గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త,  తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు.  కేవీ రంగారెడ్డి అనాధరణకు గురైన స్త్రీల దుర్గతిపైన, దళితుల, పేదల ఆర్థిక దుస్థితిపైన సానుభూతి కలిగిన వారు. స్త్రీ తన భర్త చనిపోగానే నిరాధారులై పోయేవారు. నిమ్న జాతుల వారి అభివృద్ధికోసం పనిచేసేవారు. జాగీరుదారులకు, పేద రైతులక మధ్య వివాదాలు వచ్చినపుడు పేదల పక్షాన నిలిచేవారు. లాయర్ గా ఉచితంగా వాదించేవారు. నిజాం వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లాడు. విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న కష్టాలను పేద విద్యార్థులెవరూ ఎదుర్కొనకూడదనే రెడ్డి హాస్టల్, బాలుర పాఠశాల, ఆంధ్రసరస్వతి, బాలికల పాఠశాల, రెడ్డి బాలికల హాస్టల్, ఆంధ్ర విద్యాలయం  కట్టించారు.

 

నాటి ముఖ్యమంత్రి బూర్గులను ఏ కారణం లేకుండానే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని కోరినపుడు ఆ నిర్ణయాన్ని కేవీ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మేం మళ్లీ బూర్గులనే సీఎంగా ఎన్నుకుంటే మేరేం చేస్తారని నిలదీసిన ధీరుడు. తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఆయన. తెలంగాణ కోసం నెహ్రుతో సైతం ఢీకొనడానికి వెనుకాడలేదు. పదవీ త్యాగానికి వెన్ను చూపలేదు.  సంస్థానంలో మహారాష్ట్రులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను పెట్టినా, తెలంగాణ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రిని చేసినా, విశాలాంధ్రకు వ్యతిరేకత  చెప్పినా తన వాదాన్ని చెప్పడానికి భయపడలేదు. 

1956 పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ తరపు నుంచి సంతకం చేసిన మరొక తెలంగాణ నాయకుడు జె.వి. నరసింగరావు వారు. 1972లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 1967, 1972లలో జరిగిన రెండు వరుస ఎన్నికల్లో లక్సిట్టిపేట్ నుండి ఎంఎల్ఎగా గెలిచారు.

 

 

 

మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు. ఉత్తర ప్రదేశ్పంజాబ్రాజస్థాన్తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు. ఆయన వరంగల్ లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేశాడు ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు.ఇతను హైదరాబాద్ అనే ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు.1942లో ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1978 లో కాంగ్రెస్ చీలిక సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ వర్గంలో చేరి అప్పటి ఇందిరా కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు నాయకత్వం వహించారు. 175 స్థానాలలో సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టినారు. అంతకుముందు 1938లో జైలు శిక్షను అనుభవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *