– దిల్లీలో కాలుష్యం పెరుగుతుండడంపై సీజేఐ ఆందోళన
న్యూదిల్లీ, డిసెంబర్ 26 (ఆర్‌ఎన్‌ఎ): దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారాన్ని కొనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయిలో నమోదైంది. అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైగా నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలుష్యంపై ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ దిల్లీని పీడిస్తున్న వాయు కాలుష్య సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ఉపశమనం కలిగించే విధానాల కంటే దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు అవసరమన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్న ఈ వాయు కాలుష్య సమస్యకు నిపుణులు పరిష్కారం కనుగొంటారని తనకు నమ్మకం ఉందన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం శుక్రవారం ఉదయం రాజధాని నగరంలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో నగరంలో ఓవరాల్ ఏక్యూఐ లెవెల్స్ 305గా నమోదైంది. అత్యధికంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచిక 390గా నమోదైంది. బవానాలో 379, నరేలా ప్రాంతంలో 356, ఆర్కే పురంలో 320గా ఏక్యూఐ నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగ్గా నమోదైంది. ద్వారకలో 253, అరబిందో మార్గ్ (258), మందిర్ మార్గ్ (234), ఎవిమానాశ్రయం (239)గా గాలి నాణ్యత నమోదైంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





