నిప్పుల వాగు
కత్తుల సాగు
శాంతి వనంలో పారవు
అహింసా పొలంలో పండవు
తెలుపు అకుపచ్చ పతాకపు
రెపరెపల కిందా
తోటలోని పూలలా
స్వేచ్ఛగా తిరుగాడె పక్షులా
బతుకు తున్నారు జనం
ఆకలి దప్పిక తీర్చే ధరిత్రిని
రాజ్యాధికార ధిక్కారంతో
బడా వ్యాపారులకు కొమ్ము కాస్తే
పారుతుంది నిప్పుల వాగు
పండుతాయి కత్తుల కంకులు
రెపరెపలాడుతుంది ఎర్ర జండా
రేడియమ్





