సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలి

– ప్రధాని మోదీ పిలుపునకు యువత స్పందించాలి
– ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆటల పోటీలు
– పోస్టర్‌ విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్‌ మహోత్సవను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. ఈమేరకు సికింద్రాబాద్‌ మహబూబ్‌ కాలేజ్‌ ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో జరిగిన సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌, పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇవాళ భారతరత్న, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దేశానికి అనేక సేవలందించిన మహానుభావుడు వాజ్‌పేయి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఆయను ఒక సాధారణ వ్యక్తి కాదని, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రేమ, ఆప్యాయతతో దగ్గరయ్యారని తెలిపారు. ఆయన అద్భుత కవి, ఆయన కవి సమ్మేళనాల్లో కూర్చునేందుకు చోటు ఉండేది కాదు. పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ తగ్గినప్పుడు ఇతర పార్టీల నుంచి చీలిక తెచ్చి అధికారం తీసుకుందామని చాలా మంది అన్నప్పుడు ఒక్క ఎంపీ తక్కువ ఉన్నప్పుడు అధికారం వద్దు.. నేను ప్రజల మధ్యకు వెళ్తా అని ప్రజల్లోకి వెళ్లిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఏ ప్రధానమంత్రీ సాహసం చేయని విధంగా అణు పరీక్షలకు అనుమతి ఇచ్చిన ఏకైక ప్రధాని వాజ్‌ పేయి అని చెప్పారు. వాజ్‌పేయి దగ్గరికి అబ్దుల్‌ కలాం వచ్చినప్పుడు మూడో కంటికి తెలియకుండా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణు పరీక్షలు చేయించారన్నారు. ఈరోజు అద్భుత జాతీయ రహదారులు మన ముందు కనిపిస్తున్నాయంటే దానికి ఆద్యుడు వాజ్‌పేయి అన్నారు.. వాజ్‌పేయి జన్మదినోత్సవాన్ని ప్రధాని మోదీ క్రీడలకు అంకితం చేశారని చెప్పారు. వాజ్‌పేయికి యువ హృదయ సామ్రాట్‌? అనే బిరుదు ఉన్నది. దేశంలోని యూత్‌ మొత్తం వాజ్‌పేయి అంటే ఎంతో ఇష్టపడేవారు. అందుకే వాజ్‌పేయి జన్మదినోత్సవం సందర్భంగా ఆటల పోటీలకు శ్రీకారం చుట్టారన్నారు.. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో 40 డివిజన్ల వారీగా కమిటీలు వేశామని, దీని పరిధిలోని క్రీడాకారులు, పార్టీ నాయకులు, విద్యా సంస్థలు, స్పోర్ట్స్‌ అసోసియేషన్స్‌ అందరితో సమన్వయం చేసుకోవాలని, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అందరూ రిజిస్టర్‌ చేసుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కాంపిటిషన్స్‌? బాయ్స్‌?, గర్ల్స్‌? ఇద్దరికి వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. అన్ని ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో ఇంటర్‌ క్యాంపస్‌ కాంపిటీషన్స్‌ పెట్టాలి. విన్నర్స్‌ టీమ్‌ను రెడీ చేసుకోవాలి. అంబేద్కర్‌ కాలేజీ, కేశవ్‌ మెమోరియాల్‌ కాలేజీల్లో పోటీలు పెట్టాలి. ప్రతి డివిజన్‌ వారీగా క్రికెట్‌, కబడ్డి, ఖోఖో టీమ్‌లు ఎన్ని వస్తే అన్నిటినీ గుర్తించి డివిజన్ల వారీగా పోటీలు పెట్టాలన్నారు. రన్నర్స్‌ టీమ్‌, విన్నర్స్‌ టీమ్‌లతో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా మళ్లీ పోటీలు పెట్టాలి. ఇక్కడ వచ్చిన రన్నర్స్‌, విన్నర్స్‌ టీమ్‌లతో పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో జరగాలి. అసెంబ్లీస్థాయిలో మీడియాతో టీమ్‌తో పార్టీ నాయకుల టీమ్‌తో కాంపిటిషన్‌ పెట్టాలి. క్రికెట్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించి ఎక్కువమందిని భాగస్వాములను చేయాలి. జనవరి10 వరకు15 రోజుల పాటు టీమ్‌? ల రిజిస్ట్రేషన్లు చేయాలి. ఏ డివిజన్‌? పోటీలు ఆ డివిజన్లోనే జరగాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *