కాంగ్రెస్‌ది మాఫియా పాలన

– చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా
– ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందన్న కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు విూద బాంబులు వేశారని.. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్‌డ్యామ్‌ల విూద జెలటిన్‌ స్టిక్స్‌ వేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్‌ మ్యాన్‌ రాజేంద్ర సింగ్‌ ఇది మానవ నిర్మిత విధ్వంసం అని మొత్తుకుంటున్నా ఈ ’చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. డ్రిల్లింగ్‌ మెషీన్లతో రంధ్రాలు చేసి జెలటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో నిరూపించారన్నారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్‌ డ్యామ్‌లను పేల్చేస్తారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్‌స్టర్ల అడ్డాయా అని నిలదీశారు. భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్‌డ్యామ్‌లు కడితే వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని మండిపడ్డారు. విూ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం రైతాంగం బలి కావాలా అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్‌ మంత్రులకు రాజేంద్రసింగ్‌ రిపోర్ట్‌ చెంపపెట్టు అని కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడు విూ సమాధానం ఏంటి రేవంత్‌ రెడ్డి అని నిలదీశారు. అభివృద్ధి చేయడం చేతకాదు కానీ ఉన్న ఆస్తులను కూల్చడంలో విూరు సిద్ధహస్తులని విమర్శించారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టండని డిమాండ్‌ చేశారు. రాజేంద్ర సింగ్‌ డిమాండ్‌ చేసినట్లు పీపుల్స్‌ ఎంక్వైరీ కమిషన్‌ వేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ బాంబుల సెగ విూ కుర్చీ దాకా రావడం ఖాయమని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *