– మండిపడ్డ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 22: పుట్ బాల్ ఆడుకోవడం సిఎం రేవంత్‌కు బాగా తెలుసని, కెటిఆర్‌ను ఎలా ఫుట్ బాల్ ఆడుకోవాలో అలా ఆడుకుంటాడని కెటిఆర్‌ను ఉద్దేశించి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటామన్న కెటిఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పంఇంచారు. సోమవారం నాడు డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్ను ఫుట్‌బాల్ ఆడుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రపంచ ఆటగాడితోనే ఫుట్‌బాల్ ఆడినట్లు తెలిపారు. కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎట్లా ఆడాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. అధికారం పోయిందని అక్కసుతో హరీష్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావుకు మించి తప్పుడు కూతలు, తప్పుడు మాటలు, గ్లోబల్ ప్రచారం ఎవరు చేయరని విమర్శించారు. అధికారం పోయాక ఎవరో వాళ్ళ ఇంట్లో పడి గుంజుకున్నట్టుగా ఫీలై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారని.. సరిగా పని చేయకపోతే ప్రజలు అధికారం నుంచి దింపేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ మంచిగా పని చేయనప్పుడు కాంగ్రెస్‌ను కూడా దించుతారని అన్నారు. కవితకు జవాబు చెప్పలేక కాంగ్రెస్ పార్టీ ద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలతో తాము పాజిటివ్ దృక్పథంతో ఉంటామని స్పష్టం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఫుట్‌బాల్ ఆడుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




