కోల్ సేతు విండోకు కేంద్రం ఆమోదం

– కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి 

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: దేశంలోని బొగ్గు, గనుల రంగంలో ప్రధాన. మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఫలితంగా గనుల రంగంలో సమూల మా ర్పులు జరిగాయని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. గత కొన్నేళ్లలో బొగ్గు, గనుల రంగంలో అనేక రికార్డులను తిరగరా శాం. చరిత్రలోనే తొలిసారిగా బొగ్గు ఉత్పత్తి. రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని సా ధించామన్నారు. కేంద్రం మైన్స్ అండ్ మిన. రల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులరైజేషన్) చట్టంలో మార్పులు తీసుకొచ్చింద న్నారు. 2015 నుంచి గనుల కేటాయింపులో పొరద ర్శకంగా వేలం ప్రక్రియను ప్రారంభిం చాం.. దీంతో గనుల కేటాయింపులో అవినీతి, అక్ర మాలకు తావులేకుండా చేశామని గుర్తుచేశా రు. తాజాగా కోల్ సేతు విండోకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘కోల్ సేతు. విండో’తో బొగ్గు, గనుల రంగంలో మరింత పారదర్శకత వస్తుంది. దేశంలోని బొగ్గు రంగం ఆత్మ నిర్భరత దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో సరికొత్తగా తీసుకొచ్చిన ఈ కోల్ సేతు విండో ద్వారా బొగ్గును ఫర్టిలైజర్, పవర్ సెక్టార్ మినహా సిమెంట్, స్టీల్, స్పాంజ్ ఐరన్, అల్యూమినియం వంటి నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్ కంపెనీలు తమ సొంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం కలుగుతుం దన్నారు. తద్వారా భారతదేశం ఎగుమతులకు హబ్ గా మారనుంది. దేశంలో వాష్ చేసిన బొగ్గుకు డిమాండ్ ఉండటంతో విదేశాల నుం. చి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అయితే తాజా విండోతో బొగ్గును వాషరీ ఆపరేటర్లు వాషింగ్ చేయొచ్చు. దీంతో దేశంలోనే నాణ్య మైన బొగ్గు లభ్యత పెరిగి దిగుమతులు తగ్గుతాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *