హైదరాబాద్‌లో అఖిలేశ్‌ ‌యాదవ్‌

సీఎం రేవంత్‌, ‌కేటీఆర్‌లతో వేర్వేరుగా భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 12: ‌నగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో అఖిలేష్‌ ‌భేటీ అయ్యారు. వివిధ రాష్టాల్రు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌మాజీ ఎంపీ అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ‌ఠాకూర్‌, ‌కాంగ్రెస్‌ ‌నేత రోహిన్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేష్‌ యాదవ్‌ ప్రశంసించారు. దేశంలోని యాదవ సమాజం రేవంత్‌ రెడ్డిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయన్నారు. యాదవుల హృదయ లో రేవంత్‌ రెడ్డి ఉండిపోతారని అఖిలేష్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలోని యాదవ వర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఆ తర్వాత కాసేపటికి నంది నగర్‌లోని కేటీఆర్‌ ‌నివాసానికి అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌చేరుకోగా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ తాజా రాజకీయ అంశాలపై నేతలిద్ద‌రూ చర్చించారు. అనంతరం హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్ ‌వద్దకు చేరుకున్న అఖిలేశ్‌.. ‌యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాలకతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. సదర్‌ ‌సమ్మేళనానికి గొప్పగా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూపీలో బీజేపీని వెనక్కి నెడుతున్నామని, ఏపీ సపోర్ట్ ‌లేకపోతే కేంద్రంలో బీజేపీ వచ్చేది కాదని అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *