గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ

– ఆయన జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌ నివాళులు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : దశాబ్దాలపాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు డాక్టరు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గడ్డం వంశీ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నాయకులు రోహిణ్‌ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *