‘సమ్మిట్‌’ పనులను 5నాటికి పూర్తిచేయండి

– ఏర్పాట్లు పరిశీలించి దిశానిర్దేశం చేసిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఈనెల 5వ తేదీ లోపు పూర్తి చేసి 6వ తేదీన డ్రై రన్‌ నిర్వహించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘సమ్మిట్‌’ జరగనున్న ప్రాంగణంలో ఏర్పాట్లను మంగళవారం స్వయంగా పరిశీలించి వారికి సలహాలు, సూచనలు చేశారు. వేదిక వద్ద విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, తెలంగాణ బ్రాండ్‌ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. పార్కింగ్‌, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటీ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *