‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

– మాజీ మంత్రి వేముల పిలుపు

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని, అలాగే 29న నిర్వహించే ‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార పార్టీ తంటాలు పడుతోందని, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 42 శాతం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ చివరికి పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ బీసీలకు ద్రోహం చేయడమేనని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక న్యాయస్థానం చెప్పేవరకు తెచ్చుకుందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి మంచి పట్టు ఉందని, స్థానిక ఎన్నికలతోపాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. రెండేళ్లలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హావిూలను, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని హావిూలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా లారీకి 1.5 క్వింటాలు కోతలు పెట్టి వేధిస్తున్నారన్నారు. కేసీఆర్‌ 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, రేపంత్‌ ప్రభుత్వం మాత్రం సంఘ సభ్యులకే పంపిణీ చేస్తుండడంతో హహిళలు గ్రామాల్లో నిలదీయాలని ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సర్వేలో బీఆర్‌ఎస్‌ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలిందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యతతో పనిచేసి బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *