అగ్ని ప్రమాద బాధితులకు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హైదరాబాద్‌ షాప్‌ా అలీబండ ప్రాంతంలోని గోమతి ఎంటర్‌ప్రైజెస్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ మంగళవారం సందర్శించి, దుకాణానికి, పరిసర దుకాణాలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సమీప నివాసితులను సంఘటన గురించి అడగగా ఈ సంఘటన రాత్రి 10:28 గంటల సమయంలో జరిగినట్లు, మూడుసార్లు భయంకరమైన పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. పక్కనున్న రెడీమేడ్‌ దుకాణం పూర్తిగా దగ్ధమైందని, అలాగే ప్రమాద స్థలం పక్కనే ఉన్న స్వీట్‌ షాప్‌ తలుపులకు కూడా పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో అక్కడున్న ద్విచక్ర వాహనాలు, ఓ కారు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. గోమతి ఎలక్ట్రానిక్స్‌ యజమా శివను అపోలో హాస్పిటల్‌, డీఆర్‌డీవో కంచన్‌బాగ్‌కు తరలించగా, మరో ఇద్దరు ఉద్యోగులు గణేష్‌, కార్త్తీక్‌లను ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం నిరంజన్‌ అపోలో హాస్పిటల్‌, డీఆర్‌డీవో కంచన్‌బాగ్‌, ఉస్మానియా హాస్పిటల్స్‌ను సందర్శించి గాయపడిన వారిని పరామర్శించి, ప్రమాద నేపథ్యం గురించి విచారించారు. శివకు 80% పైగా కాలిన గాయాలు ఉన్నట్లు అపోలో హాస్పిటల్‌ వైద్యులు తెలుపుతూ అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. గణేష్‌, కార్త్తీక్‌ లు ఇద్దరికీ 25% కాలిన గాయాలు ఉన్నాయని, కోలుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఉస్మానియా సూపరింటెండెంట్‌ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో నష్టం జరిగిన పరిసర దుకాణదారులను ఆదుకోవడంతోపాటు, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని, అలాగే పునరుద్ధరణకు సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరంజన్‌ కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *